World / Health
సెల్‌‌ఫోన్‌‌తో మలేరియాను గుర్తించవచ్చు..?
452 days ago

ప్రాణాంతకమని భావిస్తున్న మలేరియా వ్యాధిని ఈజీగా సెల్‌‌ఫోన్‌తో గుర్తించే రోజులు రాబోతున్నాయట.. ఇన్నాళ్ళూ మైక్రోస్కోప్‌‌తో ఈ వ్యాధి బ్యాక్టీరియాను గుర్తించేవారు. ఇందుకు సమయం కూడా చాలా పట్టేది. కానీ తాజాగా లేటెస్ట్ మోడల్ డివైజ్‌‌ను డెవలప్ చేస్తున్నారు. దీన్ని సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌కి లింక్ చేస్తే సరి.. మొబైల్ ఆప్టికల్ పోలరైజేషన్ ఇమేజింగ్ డివైజ్ అనే అతి చిన్న సాధనం..అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా ప్యారాసైట్‌‌ను గుర్తించడంలో ఎంతో సాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

మనిషి వెంట్రుకలోని మందం కన్నా 10 రెట్లు తక్కువగా ఉన్న ఇమేజెస్‌‌ను ఇది ఫోటో తీయగలదని, ఫోన్ యాప్ వినియోగించి కేవలం కొన్ని నిముషాల్లోనే ఈ బ్యాక్టీరియాను డయాగ్నైజ్  చేయవచ్చునని వారు తెలిపారు. పైగా మలేరియా సోకిన రెడ్ బ్లడ్‌‌సెల్స్ ఎన్ని ఉన్నాయో కూడా ఇది గుర్తించగలదని రీసెర్చర్లు చెబుతున్నారు. ఆఫ్రికా వంటి దేశాల్లో ఈ వ్యాధి బారిన పడి అనేకమంది మరణిస్తున్నారు. సెల్‌‌ఫోన్ అందరికీ అందుబాటులో ఉంటుంది గనుక ఇక మలేరియా పని పట్టవచ్చునని వాళ్ళు అంటున్నారు.


 

 
 
 
Related News

JournalistDiary