World / Health
ఇవి తింటే ఆరోగ్యం పూరే...
350 days ago

సిటీలో రోడ్డు పక్కన కనిపించే తోపుడుబండ్లలోనో, ఛాట్ బండార్లలోనో పానీ పూరీలు, గప్ చిప్‌లు కనిపిస్తే నోరూరి వాటిపైన పడే నగరవాసులకో చేదు వార్త.. ఇవి రుచిగా ఉండవచ్చు.. కానీ వీటిలో హానికరకమైన బ్యాక్టీరియా, ఫంగస్, ఈ-కొలీ  ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన మెడిసిన్ డిపార్ట్ మెంట్ ఇటీవల జరిపిన స్టడీలో... స్ట్రీట్ ఫుడ్ కనిపించడానికి బాగానే ఉన్నా.. వీటికి వాడుతున్న 45 శాతం నీటిలో, 75 శాతం చట్నీలో కాలుష్యకారకమైన ఈ-కొలీ ఉంటుందని, ఇది ఆరోగ్యానికి చెడు చేస్తుందని వెల్లడైంది.

వీటితో బాటు పండ్ల రసాల శాంపిల్స్ ని కూడా ఈ డిపార్ట్ మెంట్ బృందం పరిశీలించగా..రకరకాల ఫంగస్ జాడలు కనబడ్డాయి.  ఈ బండ్ల వద్ద ఓపెన్ నాలాలు, చెత్తకుండీలు ఉండడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ సులువుగా వీటిలో చేరుతాయని తెలిసింది.  చాలామంది తాము పానీ పూరీలు లేదా గప్‌చిప్‌ల వంటి వాటిని తిన్న తరువాత ప్లాస్టిక్ ప్లేట్లను అక్కడే పారేయడం చేస్తుంటారు. ఇవి కూడా డేంజరే అంటున్నారు. అనేకమంది వెండర్లు తమ కస్టమర్లకు డిస్పోజబుల్ ప్లేట్లను వాడుతుంటారు.. పైగా వాటిని శుభ్రం చేయరన్న విషయాన్ని ఈ బృందం గమనించింది. అందువల్ల ఇంట్లో శుభ్రంగా వీటిని తయారు చేసుకుని వేడివేడిగా తినడమే బెటర్ అని నిర్ధారించారు. 

 

Read Also

 
Related News
JournalistDiary