AP and TS / General
కోర్టుకు హాజరు కావాల్సిందే...
193 days ago

నటి రంభ చిక్కుల్లో పడింది. వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరు కాని ఈమెకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు వెంటనే హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. పద్మాలయ స్టూడియోలో జరుగుతున్న ఓ టీవీ ఛానెల్ డ్యాన్స్ షో కు న్యాయ నిర్ణేతగా రంభ వ్యవహరిస్తోంది.  మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసులు ఆమెకు సమన్లు అందజేశారు. రంభ సోదరుడు శ్రీనివాస రావు వివాహం 1999 లో పల్లవితో జరిగింది. 2014 నుంచి అత్తింటి వారి వేధింపులు పెరగడంతో ఆమె అదే ఏడాది నాంపల్లి లోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో భర్త, అత్త మామలపై పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలపై అప్పట్లో బంజారాహిల్స్ పోలీసులు రంభతో బాటు వీరిపై కేసు నమోదు చేశారు. అయితే అమెరికాలో ఉంటున్న రంభకు సమన్లు జారీ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary