AP / Politics
రోజా షాకిచ్చింది ..
193 days ago

వైకాపా ఎమ్మెల్యే రోజాపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్న టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. మార్చి  8 న కోర్టు ముందు హాజరు కావాలని నాంపల్లి లోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. వివేకా వ్యాఖ్యలపై రోజా పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. రోజా తరఫున వైకాపా లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర రెడ్డి తన వాదనలను వినిపించారు. గత ఏడాది ఫిబ్రవరి 29 న వివేకా మీడియాతో మాట్లాడుతూ రోజానుకించపరిచేలా కామెంట్స్ చేశారన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సీడీని కోర్టుకు అందజేశారు.


 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary