World / Health
ఇది తింటే ఒబేసిటీకి చెక్
404 days ago

పైన్ యాపిల్ వంటి పండ్లు ఒంటి బరువు తగ్గడానికి దోహదపడతాయని గతంలో చాలామంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. అయితే మరోపండు కూడా ఈ లిస్టులోచేరింది. ఊబ కాయం తగ్గడానికి, టైప్-2 డయాబెటిస్ ని  నియంత్రించడానికి మామిడి పండు కూడా ఉపకరిస్తుందట. అమెరికా ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ రీసెర్చర్లు జరిపిన తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. పిజ్జాలు, బర్గర్లు వంటివి తినడం వల్ల కలిగే కొవ్వును ఈ పండు లోని బ్యాక్టీరియా తగ్గిస్తుందని వారంటున్నారు.

12 వారాలపాటు సుమారు 60 ఎలుకలపై వారు రీసర్చ్ చేశారు. మ్యాంగో లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ ని కంట్రోల్ చేయగలిగే గుణాలు ఇందులో ఉన్నాయి అని ఎడ్రలిన్ అనే ప్రొఫెసర్ అంటున్నారు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ మ్యాగజైన్ లో పరిశోధకులు తమ ఆర్టికల్ ను ప్రచురించగా..యూఎస్ లోని నేషనల్ మ్యాంగో బోర్డ్ దీనిని ఆమోదించింది. ఇండియాలో మామిడి పండ్ల వినియోగం చాలా ఎక్కువ.. అలాగే స్థూల కాయం, టైప్-2 మధుమేహంతో బాధ పడుతున్నవారు మామిడి పండును తిని తమ రుగ్మతలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary