India / Crime
ఆ హంతకుడ్ని వదలొద్దు
120 days ago

సుమారు 25 ఏళ్ళు జైలుశిక్ష అనుభవించిన ఓ హంతకుడ్ని విడుదల చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తాను ఇప్పటికే దీర్ఘ కాలం జైల్లో గడిపానని, ఇక విడుదల చేయాలని కోరిన ఆ దోషి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇది ఎప్పుడో 1991 నాటి మాట. కోల్‌కతాలో సుమారు 70 ఏళ్ళ ఖేత్వత్ అనే ముసలాయన నవల్ఖా అనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వయస్సేమీ తక్కువ కాదు.. 60 ఏళ్ళ పైమాటే. ఖేత్వత్ భార్య వీళ్ళ నిర్వాకాన్ని సహించలేకపోయింది. కిరాయి హంతకుడైన ఖోఖన్ గిరికి లక్ష రూపాయల సుపారీ ఇచ్చి.. తన భర్తను, అతనితో సహజీవనం చేస్తున్న మహిళను చంపేయాలని పురమాయించింది. 

1991 డిసెంబరు 25న భబంజ్‌పూర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఈ కేసు మొదట ట్రయల్ కోర్టుకు, ఆ తరువాత కలకత్తా హైకోర్టుకు, అనంతరం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. నిందితునికి ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా.. కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్ధించాయి. అప్పటికే ఖేత్వత్ భార్య మరణించింది. ఈ కేసు విచారణకు సుప్రీం కోర్టుకు పదేళ్ళు పట్టింది. కాగా.. తన క్లయింటు ఇప్పటికే పాతికేళ్ళు జైలు శిక్ష అనుభవించాడని, ఇక అతడిని విడుదల చేయాలని ఖోఖన్ గిరి తరఫు అడ్వొకేట్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.

 

 
 
 
Related News

JournalistDiary