India / General
సారీ చెప్పండి..లేదా..?
162 days ago

ఇంటి తలుపుల వద్ద కాళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగించే డోర్ మ్యాట్స్ పై భారతీయ జెండాను ముద్రించడం తప్పేనని ఆన్ లైన్ సంస్థ అమెజాన్ అంగీకరించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన గట్టి హెచ్చరికతో దిగివచ్చిన ఈ సంస్థ తమ సైట్ లో అమ్మకానికి పెట్టిన ఈ తరహా డోర్ మ్యాట్స్ ను తొలగిస్తున్నామని పేర్కొంది. ఇక వీటిని విక్రయానికి  పెట్టబోమని అంటూ ఆ సంస్థ ప్రతినిధి ఒకరు సారీ చెప్పారు.

అమెజాన్ నిర్వాకంపై మండి పడిన సుష్మ..ఈ సంస్థ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే అమెజాన్ అధికారులెవరికీ భారతీయ వీసాలను జారీ చేయబోమని ట్వీట్ చేశారు. అమెజాన్ కెనడా వెబ్ సైట్ లో..భారతీయ త్రివర్ణ పతాక చిత్రంతో అమ్మకానికి పెట్టిన డోర్ మ్యాట్స్ ఫోటోను ఓ ట్విటర్ యూజర్ పంపడంతో సుష్మా స్వరాజ్ అది చూసి తీవ్రంగా స్పందించారు.

 

 
 
 
Related News

JournalistDiary