AP and TS / Entertainment
యంగ్ హీరోతో తమన్నా రొమాన్స్
26 days ago

‘బాహుబలి’ తరువాత మిల్కీబ్యూటీ తమన్నా కెరీర్ స్లో అయిపోయింది. ఆ మూవీ సక్సెస్ క్రెడిట్ మొత్తం ప్రభాస్, అనుష్కల అకౌంట్‌లో పడిపోవడంతో తమన్నాకి షాక్ తగిలింది. దాంతో తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూసే స్టేజ్‌కి వచ్చేసింది తమన్నా. ఇక బాలీవుడ్ అయితే తమన్నాని ఎప్పుడో పక్కన పెట్టేసింది. ఈ దెబ్బతో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తమన్నా.. ఇప్పుడు యంగ్ హీరోల సినిమాలకూ సై అంటోంది.

రీసెంట్‌గా తమన్నా యంగ్ హీరో సందీప్ కిషన్‌తో సినిమా చేయడానికి ఓకే అనేసిందట. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో ‘ఫనా’ డైరెక్ట్ చేసిన కునాల్ కోహ్లీ తెలుగులో తమన్నా- సందీప్‌తో టాలీవుడ్‌లో సినిమా తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే.. ప్రీ ప్రొడక్షన్‌ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్‌లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం.

 

 
 
 
Related News

JournalistDiary