India / Politics
కరువు ముంచుకొస్తోంది.....
219 days ago

తమిళనాడులో అన్ని ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు. గత ఏడాది ఈశాన్య రుతు పవనాలు ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో వర్షాలు సరిగా పడలేదని ఆయన అన్నారు. రైతులకు భూమి శిస్తు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. గత రెండు నెలల్లో 17 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు 3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని పన్నీర్ సెల్వం చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించు కున్న ఆయన..కరువు సహాయక చర్యలకోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని, ఎకరానికి రైతులకు అయిదు వేలకు పైగా పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు క్రాప్ కటింగ్ పరిహారంగా సుమారు పాతికవేల వరకు చెల్లించడానికి ముందుకు వచ్చినట్టు పన్నీర్ సెల్వం తెలిపారు.

 
 
Related News