India / Entertainment
ఖైదీతో నిలబడ్డాడు....
193 days ago

మెగాస్టార్ చిత్రం ఖైదీ నెం.150 లో విలన్ పాత్రధారి తరుణ్ అరోరా తనేమిటో నిరూపించుకున్నాడు. ఒరిజినల్ తమిళ మూవీ కత్తి లో విలన్ నీల్ నితిన్ ముకేష్ అందరి చేతా శభాష్ అనిపించుకుంటే..తరుణ్ కూడా ఆ స్థాయిని అందుకుంటాడా అని అనుమానించినవారికి పూర్తి సంతృప్తి కలిగించాడు. ఇక ఈ కొత్త ప్రతినాయకునికి దండిగానే ఆఫర్లు రావడం ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడు లో తరుణ్ కి మంచి ఛాన్స్ లభించగా, బోయపాటితో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న కొత్త చిత్రంలోనూ కీలకమైన రోల్ పోషించబోతున్నాడు. మార్చి నెల నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఖైదీ మూవీ తరుణ్ ఆరోరాకు మంచి పుషప్ నిచ్చిందన్నమాట.

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary