India / Crime
రాత్రివేళ.. మహిళా టెక్కీపై..
180 days ago

పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న 23 ఏళ్ళ అంతారా దాస్ అనే మహిళా టెక్కీ దారుణహత్యకు గురయింది. కోల్‌కతాకు చెందిన ఈమె శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో ఆమెను వెంబడించాడు.

తనను రక్షించాలంటూ అంతారాదాస్ పరుగెత్తగా.. ఆ దుండగుడు ఒక చోట ఆపి ఆమెతో వాగ్వాదానికి దిగాడని.. ఒక దశలో కత్తితో ఆమె మెడ, చేతిపై తీవ్రంగా గాయపరచి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు అంతారా దాస్‌ను దగ్గరిలోని ధన్వంతరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. అంతారా దాస్ ఐడెంటిటీ కార్డు ఆధారంగా పోలీసులు ఆమె తలిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న వారు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary