India / Sports
క్రికెట్‌‌‌ని మించిన ఆనందం మరొకటుంది
4 days ago

అవును ! క్రికెట్ ఫీవర్‌‌ని మించిన ఆనందం మరొకటి ఉంది. ఒకే రోజు.. ఒకే వేదిక.. అయితే ఆటలు వేరు.. ఆదివారం జరిగిన ఓ విశేషం ఇండియన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓవల్ గ్రౌండ్స్ లో ఓ వైపు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోతేనేం..? మరోవైపు ప్రపంచ హాకీ లీగ్ సెమీ ఫైనల్ టోర్నీలో ఇదే ప్రత్యర్థిని భారత్ చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయంతో క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకుంది.

ఏక పక్షంగా సాగిన పూల్-బీ మ్యాచ్ లో మన జట్టు 7-1 తో పాక్ పై ఘన విజయం సాధించడం చెప్పుకోదగినది. హర్మన్ ప్రీత్ బృందం కేవలం 12 నిముషాల్లో మూడు గోల్స్ కొట్టి పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేయగల్గింది.


క్రికెట్ ని పక్కన బెట్టి హాకీని భారత జాతీయ క్రీడగా పరిగణించాలని ఈ క్రీడాభిమానులు కోరుతున్నారు. ఇక తెలుగు తేజం గుంటూరు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ఇండోనీసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.

జపాన్ ప్లేయర్ కుజుమసా సకాయ్ ని మట్టి కరిపించాడు. 21-11, 21-19 తేడాతో సకాయ్ పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఒకే రోజున అటు, హాకీ, ఇటు బ్యాడ్మింటన్ లో మనవాళ్ళు రాణించి శెహభాష్ అనిపించుకున్నారు. ఇంతకాలం క్రికెట్ చాలా పాపులర్ గేమ్. అయితే ఇక ఈ ఈక్వేషన్ మార్చుకోవలసిన పరిస్థితి ! చెస్ లోనూ వాల్డ్ టాప్ -5 లో మనోళ్ళు ఉన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమే.. దాయాది పాక్ చేతిలో కోహ్లీ జట్టు ఓడినా, ఇలా హాకీ, బ్యాడ్మింటన్ క్రీడల్లో ఇండియన్స్ విజయం సాధించడం ఎంతో ఊరటనే కాదు.. సంతోషించదగిన విషయం కూడా !

 

 
 
 
Related News

JournalistDiary