India / Politics
వీళ్ళనేమనాలి ?
70 days ago

నాడు..75 సంవత్సరాల క్రితం క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి, దాన్ని బాయ్ కాట్ చేసిన వాళ్ళే నేడు జాతీయవాదం, దేశ భక్తి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని " ఆప్ " అధికార ప్రతినిధి అశుతోష్ విమర్శించారు. ఈ నెల 8 న దేశం క్విట్ ఇండియా యానివర్సరీని జరుపుకొన్నసందర్భంగా ఆయన..ఆరెస్సెస్ నాయకులు ఆనాడు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదని ఆరోపించారు.

ఆ ఉద్యమాన్ని సూపర్ ఫిషియల్ నేషనలిజం (అతి జాతీయవాదం) గా అభివర్ణించి దాన్ని బహిష్కరించారని, గోల్ వాకర్ వంటి ఆరెస్సెస్ నాయకుల దృష్టిలో భగత్ సింగ్, చంద్ర శేఖర్ వంటి వారు అసలు నాయకులే కారని అశుతోష్ ఓ ఆర్టికల్ లో పేర్కొన్నారు. మన స్వాతంత్ర్య యోధుల బలి దానాలను గుర్తించని వీళ్ళు ఈ రోజు నేషనలిజం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ యానివర్సరీని బీజేపీ ఎలా జరుపుకొంటుందని ప్రశ్నించారు.

 

Read Also

 
Related News
JournalistDiary