AP and TS / Entertainment
‘ రాజు-మంత్రి’ దే హిట్ ?
11 days ago

ఈ శుక్రవారం పోటాపోటీగా ముగ్గురు హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సరికొత్త పోటీలో హిట్ ఎవరిది ? అయిదు రోజుల సెలవులతో కూడిన లాంగ్ వీకెండ్ లో ఏ హీరో మూవీ సక్సెస్ అవుతుంది ? రానా-నేనే రాజు-నేనే మంత్రి, నితిన్-లై, బెల్లంకొండ శ్రీనివాస్-జయ జానకి నాయక చిత్రాల్లో దేన్ని ఆడియెన్స్ ఆదరిస్తారోనన్న సస్పెన్స్ ఇండస్ట్రీలో పెరిగిపోతోంది.బడ్జెట్ పరంగా... నేనే రాజు..చిన్నదే అయినా ఈ మూవీ విషయంలో ప్రాఫిట్ షేరింగ్ ఉందన్న విషయం మరిచిపోకూడదు.

అలాగే లై, జయ జానకి చిత్రాలు హిట్ అయినా 45 నుంచి 50 కోట్ల వసూళ్లు  సాధిస్తేనే బయ్యర్స్ ప్రాఫిట్ జోన్ కు వస్తారని అంచనా. రానా మూవీ నేనే రాజు..... ప్రొడ్యూసర్ సురేష్ బాబు తమ చిత్రం హిందీ శాటిలైట్ హక్కులు అప్పుడే సుమారు 7 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలిపారు. పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉందని అన్నారు. ఇక లై, జయ జానకి చిత్రాలతో పోలిస్తే రానా సినిమాకే అడ్వాన్స్ బుకింగులు జోరుగా సాగుతున్నాయని తెలిసింది. ఈ లెక్కన నేనే రాజు-నేనే మంత్రి మూవీదే పైచేయి అన్న టాక్ వినిపిస్తోంది. 

 
 
Related News