World / Crime
ప్రమాదమా..? ఉగ్ర దాడేనా..?
304 days ago

జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ చేస్తున్న ప్రజలపైకి ఓ ట్రక్కు దూసుకుపోగా

12 మంది మరణించారు. 50 మందికి పైగా గాయ పడ్డారు. సెంట్రల్ బెర్లిన్ లో జరిగిన ఈ ఘటన ఉగ్ర దాడేనని భావిస్తున్నారు.

ప్రమాదానికి కారకుడైన ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశామని,

బహుశా ట్రక్కు డ్రైవర్ అతడేనని భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. క్షత గాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు.

కాగా ఆఫ్గన్ శరణార్థి ఒకడు ఈ ట్రక్కు డ్రైవర్ ను హతమార్చి తానే ఈవాహనాన్ని నడుపుతూ ఈ బీభత్సానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

 

స్టీల్ సామాన్లతో లోడ్ అయి ఉన్న ఈ వాహనాన్ని అతడు హైజాక్ చేసి అతి వేగంగా జనాల పైకి పోనిచ్చాడు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో

ఈ దుండగుడు జర్మనీ చేరుకున్నాడని తెలుస్తోంది. క్రిస్మస్ వంటి పండుగ దినాల్లో యూరప్ దేశాల్లో నరమేధానికి పాల్పడాలని ఐసిస్

వంటి ఉగ్రవాద సంస్థలు పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాయని నిఘా ఏజెన్సీలు ముందే హెచ్చరించాయి. అయితే దుండగుడు

పాకిస్తానీ కూడా అయి ఉండవచ్చునన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ట్రక్కులో ఓ వైపున ఓ మృత దేహం పడి ఉందని,

అతని వద్ద పోలండ్ దేశ లైసెన్స్ కనబడిందని పోలీసులు తెలిపారు. సుమారు పది లక్షల మంది శరణార్థులకు తమ దేశ ద్వారాలు

తెరిచి ఆవాసం కల్పించాలని జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మార్కెల్ తీసుకున్న నిర్ణయం పై అప్పుడే దేశంలో పెద్ద ఎత్తున చర్చ

జరుగుతుండగా..ఈ ఘటన జరగడం మరింత తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చునని భావిస్తున్నారు. 

 

Read Also

 
Related News
JournalistDiary