Telangana / Crime
ఆ యువతులు ఎందుకలా చేశారో..?
180 days ago

హైదరాబాద్ వివేకానందనగర్ కాలనీలో ఇదో విచిత్ర ఉదంతం. అక్కడి సాయి భరద్వాజ అపార్ట్‌మెంటులో ఓ వాచ్‌మన్‌పై ఇద్దరు యువతులు కత్తితో దాడికి దిగారు. అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎందుకు శబ్దాలు వస్తున్నాయని ప్రశ్నించిన వాచ్‌మన్ బీసయ్యపై జరిగిన ఈ  దాడిలో బీసయ్య గాయపడ్డాడు. 

ఫ్లాట్‌లో ఉంటున్న వారు సీసీ కెమెరా ఫుటేజీతో సహా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఇద్దరు యువతుల్లో ఒకరు పోలీసు జీపు ఎక్కేందుకు నిరాకరిస్తూ వారిని దుర్భాషలాడినట్టు తెలిసింది. ఈ యువతులను రిటైర్డ్ ఎస్సై జీ.వై.రావు కూతుళ్ళు శైలజ, సునీతగా గుర్తించారు. సుమారు 15 ఏళ్ళుగా వీరు ఈ అపార్ట్‌మెంటులో ఉంటున్నారని, తరచు వీరి ప్రవర్తన వింతగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary