Telangana / Crime
‘శాంతి’నగర్‌లో ఫైర్.. ఫైర్..
157 days ago

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని శాంతినగర్‌లో జరిగిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు.. కేబీఎస్ బ్యాంక్ సీఈఓ మన్మథ దాలియా ఇంటికి చేరుకుని, ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో మన్మథ దాలియా కాలికి తీవ్ర గాయమైంది.

ఆయన్ను బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలే ఇందుకు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. దుండగుడ్ని వెంటనే పట్టుకుంటామని ఆయన అన్నారు. ఇదిలావుండగా.. దాలియాకు ప్రాణాపాయం లేదని తెలిసింది. ఆ వచ్చిన వ్యక్తి తనని డబ్బు అడిగాడని, అతనెవరో తనకు తెలియదని దాలియా పేర్కొన్నాడు. 

 

 
 
 
Related News

JournalistDiary