AP and TS / Entertainment
‘సైరా’కు వర్కింగ్ ప్రొడ్యూసర్
18 days ago

రాంచరణ్ భార్య ఉపాసనకు కీలకమైన బాధ్యత వచ్చిపడింది. తన మావయ్య, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి ఆమె వర్కింగ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనుందని సమాచారం. చెర్రీ తన ‘రంగస్థలం-1985’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ‘సైరా’ చిత్ర నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించలేకపోతున్నాడని, దీంతో దర్శకుడు సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని పూర్తి చేసి.. చరణ్ వచ్చేలోగా ‘సైరా’ నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి ఉపాసన రంగంలోకి దిగుతోందని అంటున్నారు. (సైరా మూవీకి చరణ్ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే).

కాగా.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి స్టార్ట్ కానుంది. నయనతారతోబాటు పలువురు తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ ఇందులో నటించనున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary