World / General
డాలర్ డ్రీమ్స్ ఢమాల్ !
171 days ago

అమెరికాలో ఉద్యోగాలకోసం ఉవ్విళ్ళూరుతున్నభారతీయుల ఆశలపై అక్కడి ప్రభుత్వం నీళ్ళు చల్లుతోంది. హెచ్ 1 బీ వీసా రూల్స్ ని కఠినతరం చేయబోతున్నారు. అమెరికన్లకే అమెరికా ఉద్యోగాలు అంటూ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న ట్రంప్ నినాదం మెల్లగా కార్యరూపం దాల్చనుంది. కొత్తగా ఎన్నికైన అమెరికా కాంగ్రెస్..హెచ్ 1 బీ వీసాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు చట్టం (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్) బిల్లును మళ్ళీ ప్రవేశ పెట్టింది.

ఈ వీసా జారీ చేయడానికి కనీస వార్షిక వేతనాన్ని ప్రస్తుతమున్న 60 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచాలని, మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును తొలగించాలని ఈ బిల్లులో ప్రధానంగా నిర్దేశించారు. రిపబ్లికన్ ప్రతినిధి డారెల్ ఇస్సా, డెమోక్రటిక్ సభ్యుడు స్కాట్ పీటర్స్ ఈ బిల్లును బుధవారం అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. వీరిద్దరూ యూఎస్ లో భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. తాను అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి రోజే చేపట్టే చర్యల్లో ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు కూడా ఒకటని ట్రంప్ ఇదివరకే ప్రకటించాడు.

 

 
 
 
Related News

JournalistDiary