India / Sports
వార్దాకు ఊగిపోయిన బిల్డింగులు
108 days ago

వర్ద తుపాను తమిళనాడులో  బీభత్సం సృష్టిస్తోంది. ప్రచండమైన గాలులతో చెన్నైలో భవనాలు ఊగిపోతున్నాయి. గంటకు 100 నుంచి 130 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలిపోగా జన జీవనం అతలాకుతలమైంది. సోమవారం ఉదయం నుంచే పడుతున్న వర్షాలు నగరవాసులకు చుక్కలు చూపుతున్నాయి.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 నుంచి 15 సెంటి మీటర్ల వర్షం పడిందని అంచనా.. బలమైన గాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో  విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

 
 
 
Related News

JournalistDiary