India / Politics
ఉప రాష్ట్రపతి అయ్యారు
10 days ago

భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ స్థానంలో కూర్చున్న వెంకయ్యనాయుడు సభా కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ.. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

 
 
Related News