AP and TS / Entertainment
బాక్సింగ్ బ్యూటీతో వెంకీ కుస్తీ
26 days ago

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ‘గురు’ మూవీ తరువాత ఇప్పుటివరకూ మరో మూవీ స్టార్ట్ చేయలేదు. తనకి బాగా సూట్ అయ్యే స్టోరీ కోసం వెంకీ సెర్చ్ చేయడం వల్లే ఈ లేట్‌కి రీజన్ అంటున్నారు. ఐతే.. వెంకీ నెక్స్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్‌లో వుండబోతుందట. బాలీవుడ్ సూపర్ హిట్ ‘సుల్తాన్’ని తెలుగులో వెంకీతో రీమేక్ చేయబోతున్నాడట ప్రొడ్యూసర్ సురేష్.

రెజ్లింగ్ వీరుడి బయోపిక్‌గా తెరకెక్కిన ‘సుల్తాన్’ మూవీని తెలుగు నేటివిటీకి తగినట్లుగా చేస్తూ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయిందట. ఇక ఈ మూవీలో బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్ హీరోయిన్‌గా ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ‘గురు’ మూవీకి రితికా సింగ్ ప్లస్ అయిందనే విషయం తెలిసిందే. అందుకే.. రితికాతోనే కుస్తీ పట్టాలని వెంకీ ఫిక్స్ అయిపోయాడట. ఐతే ఈ విషయంలో అఫిషియల్ క్లారిటీ రావాల్సి వుంది.

 

Read Also

 
Related News
JournalistDiary