World / Health
విక్స్ యాక్షన్ 500 బ్యాన్
522 days ago

ఇండియాలో విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా తయారీని, అమ్మకాలను నిలిపివేశారు. ఈ మేరకు అమెరికా కన్సూమర్ హెల్త్ సంస్థ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ప్రకటించింది. ఆరోగ్యానికి ఇది హాని చేసేలా ఉందంటూ రెగ్యులేటర్స్ నిషేధం విధించడంతో ఈ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. చికిత్సాపరంగా విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా ఆశించిన ఫలితాలను ఇవ్వడంలేదని ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం పేర్కొంది. దీంతో ఈ మందు మీద బ్యాన్ విధిస్తూ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీకి ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.

నిన్నటికి నిన్న దగ్గు నివారణకు వాడే కోరెక్స్ సిరప్‌పైనా నిషేధం విధించిన విషయం విదితమే. విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రాలో పారాసిటిమాల్, ఫినైల్ ఎఫ్రిన్, కెఫిన్ కాంబినేషన్ ఉంటుంది. కానీ వీటివల్ల పెద్దగా ఫలితాలు ఉండడం లేదని నిపుణులు తేల్చారు. ఈ మెడిసిన్ వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయా.. అనుమానాస్పదమే అని వాళ్ళు అంటున్నారు. ఇండియాలో ఇప్పటివరకు నిషేధించిన 300కు పైగా మెడిసిన్స్‌లో ఇది కూడా చేరిపోయింది.

 
 
Related News