World / Entertainment
విక్టోరియా అండ్ అబ్దుల్ ట్రైలర్
138 days ago

ఒకప్పుడు విక్టోరియా రాణికి ఇండియన్ ముస్లిం అటెండెంట్ మున్షీగా వ్యవహరించిన చారిత్రిక నేపథ్యంతో విక్టోరియా అండ్ అబ్దుల్ అనే టైటిల్ తో మూవీ తెరకెక్కించారు. ఇందులో అలీ ఫజల్ మున్షీ పాత్రలో నటించగా, విక్టో రియా మహారాణిగా జుడీ డెంచ్ యాక్ట్ చేసింది.

బ్రిటిష్-అమెరికన్ బయో గ్రాఫికల్ మూవీ అయిన ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం ఆగ్రాలో జరిగింది. అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకోవడంతో మధ్యలోనే షూటింగ్ ఆపి దాన్ని లండన్ కి షిఫ్ట్ చేశారు. స్టీఫెన్ ఫ్రియర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక మహా రాణికి, సేవకునికి మధ్య ఉన్న ఆప్యాయత, అభిమానాలను చాటింది. విక్టోరియా రాణి చివరి కెరీర్ లో సుమారు 15 సంవత్సరాలు మున్షీ ఆమెకు అటెండెంట్ గా వ్యవహరించాడు.

 

Read Also

 
Related News
JournalistDiary