India / Entertainment
వైరల్ వీడియో.. వీరాభిమాని కోసం మమ్ముట్టి
8 days ago

సమయం దొరికితే తమకు నచ్చిన హీరోతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడతారు. షెడ్యూల్ బట్టి హీరోలు అభిమానులకు సమయం కేటాయించవచ్చు.. ఒక్కోసారి కేటాయించకపోవచ్చు కూడా. కానీ, అభిమానికి మమ్ముట్టిని చూసి నోట వెంట మాట రాలేదు. బాల‌న్..‌ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ ప్రాంతానికి చెందిన ఆదివాసి. న‌టుడు మ‌మ్ముట్టి అంటే అత‌డికి ప్రాణం. ఓ చిత్రం షూటింగ్ కోసం మ‌మ్ముట్టి వ‌య‌నాడ్‌కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న బాలన్, ఈసారి ఎలాగైనా త‌న అభిమాన హీరోని క‌ల‌వాల‌ని భావించాడు. అప్పుడే ఆ దారిలో వ‌స్తున్న బెంజ్ కారుకు ఎదురుగా వెళ్లి ఆపి ఇందులో మ‌మ్ముట్టి సార్ ఉన్నాడా? అని అడిగాడు. తాను హీరో అభిమాని అని బాల‌న్ స‌మాధాన‌మిచ్చాడు. వెంటనే ముందు సీటులోవున్న మమ్ముట్టి అద్దం తీయ‌గానే బాల‌న్‌కి నోట‌మాట రాలేదు. మ‌మ్ముట్టి.. అత‌డ్ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించి అన్ని విషయాలు అడిగి తెలుసు కోవడం ఓ సెల్ఫీ దిగడం జరిగిపోయింది. అందుకు సంబంధించి వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

 

Read Also

 
Related News
JournalistDiary