India / Entertainment
రకుల్ వెంటపడుతున్న విశాల్..?
26 days ago

షార్ట్ టైంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది రకుల్ ప్రీత్. ఒకరిద్దరు హీరోలు తప్ప తెలుగు స్టార్ హీరోలందరితో జతకట్టి హిట్స్ ఇచ్చిన రకుల్‌కి.. ఇప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రిన్స్ మహేష్‌తో ఫస్ట్ టైం రకుల్ రొమాన్స్ చేసిన ‘స్పైడర్’ రిలీజ్ కి రెడీగా వుంది. ఈ ఇయర్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘జయ జానకి నాయక’ లాంటి హిట్స్ ఇచ్చిన రకుల్ ‘స్పైడర్’తో హ్యాటిక్ హిట్ మీద కన్నేసింది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్‌లో ఆమె ఫుల్ బిజీ అయిపోయింది.

‘స్పైడర్’ హిట్ అయితే అటు కోలీవుడ్‌లోనూ రకుల్‌కి డిమాండ్ బాగా పెరిగే అవకాశం వుంది. ఇప్పటికే కార్తీతో జతకట్టిన ‘ఖాకీ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘స్పైడర్’లో రకుల్‌ని చూసిన కోలీవుడ్ స్టార్ హీరోలు.. తమ సినిమాల్లో రకుల్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలని అంటున్నారనేది కోలీవుడ్ మీడియా మాట. ఇప్పటికే విశాల్ న్యూ మూవీలో రకుల్‌కి ఆఫర్ వచ్చిందట. డేట్స్ అడ్జస్ట్ కాకపోవచ్చని రకుల్ అంటున్నా.. ఎలాగైనా అడ్జస్ట్ చేయమని స్వయంగా విశాల్ రిక్వెస్ట్ చేసాడట. దాంతో కోలీవుడ్‌లో రకుల్ కి పెరుగుతున్న క్రేజ్ ఏంటో తెలుస్తుందంటున్నారు సినీ జనాలు.

 

Read Also

 
Related News
JournalistDiary