AP and TS / Entertainment
‘150’లో ఈయనే హైలైట్
14 days ago

మెగాస్టార్ చిత్రం ‘ఖైదీ నెం.150’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హైలైట్ అయింది ఎవరు..? ఇంకెవరు? నాగబాబు కామెంట్లతో వోడ్కా వర్మేనట. ఆయన (నాగబాబు) అలా కామెంట్ మొదలెట్టాడో లేదో.. అందరి ముందూ రాంగోపాల్ వర్మే ప్రత్యక్షమయ్యాడు. వర్మ చేతివాటం చూపాడు. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఈ వర్షంలో అంతా తడిసి ముద్దయ్యేలా చూశాడు. కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ ఫంక్షన్ వేడెక్కేలా చూశాడు. 

చిరు స్పీచ్ మినహాయిస్తే ఈ ఈవెంట్ క్రెడిట్ అంతా వోడ్కా వర్మ ఖాతాలోకే వెళ్ళిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తను అటెండ్ కాకపోతే ఏం..? అంతా తానే కనిపించాడు. పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నాడనే ఒపీనియన్స్‌కి కొదవలేదు. నా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయిందంటూనే తన రియల్ అకౌంట్ చూపాడు ఆర్జీవి అనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
Related News

JournalistDiary