World / Health
ఏవి సేఫ్..? ఏవి అన్ సేఫ్?
427 days ago

మనం రోజూ తినే ఆహారం సేఫేనా? మన హెల్త్ కి అన్నీ ఓకేనా? చూడటానికి అన్నీ నోరూరించేలా కనిపిస్తాయి. కానీ, విషతుల్యమైన పెస్టిసైడ్స్ ఎన్నో వాటి నమూనాల్లో వున్నాయని వ్యవసాయ శాఖ జరిపిన పరీ..ల్లో తేలింది. బియ్యం, కాయగూరలు, పండ్లు, పప్పులు, చికెన్, మటన్ ఇలా ఎన్నో.. వీటిలో క్రిమిసంహారక పదార్ధాలున్నాయని ఈ శాఖ పేర్కొ్ంది. ఇది ఆందోళన కలిగించే స్థాయిలో వున్నాయట. 

కొన్ని రకాల కాయగూరలు... ఫిష్, పప్పుధాన్యాలకు సంబంధించి 20,618 శాంపిల్స్‌ను విశ్లేషిస్తే.. వీటిలో 3,857(18.7%) శాంపిల్స్‌లో పెస్టిసైడ్స్ అవశేషాలున్నట్లు తేలింది. పైగా 543 (2.6%) శాంపిల్స్‌లో ఫుడ్ సేఫ్టీ ఆధారిటీ సూచించిన స్థాయికన్నా ఎక్కువగా క్రిమిసంహారక అవశేషాలున్నట్లు స్పష్టమైంది. ఇక 1,180(12.5%) నమూనాల్లో నాన్- అప్రూవ్డ్(ఆమోద యోగ్యంకాని) పెసిసైడ్స్ వున్నాయి. 

 

డేంజర్ జోన్‌లో... 

అరటిపండ్లు, బత్తాయిలు, క్యారెట్, అనాస ఇలా రకరకాల పండ్ల విషయానికొస్తే... మొదట 8,342 వెజిటబుల్ శాంపిల్స్ పరీక్షించగా 229 (2.7%) శాంపిల్స్ ఇవి స్థాయిని మించి వున్నాయి. 2,239 ఫ్రూట్ శాంపిల్స్.. 40(1.8%) నమూనాల్లో ఎంఆర్ఎల్ స్థాయిని మించి వున్నట్లు కనుగొన్నారు. 805 గోధుమ శాంపిల్స్.. వీటిలో 17 నమూనాల్లో ఎంఆర్ఎల్ స్థాయిని మించి పెస్టిసైడ్స్ అవశేషాలున్నాయి. 1,076 రైస్ శాంపిల్స్... 68 నమూనాల్లో ఎంఆర్ఎల్ స్థాయిని మించి.. 1,299 పప్పు ధాన్యాల శాంపిల్స్.. 107 నమూనాల్లో ఈ స్థాయిని మించేశాయి. 

 

పప్పు ధాన్యాలు...

715 శాంపిల్స్‌లో ఒకటి, 174 టీ శాంపిల్స్‌లో నాలుగు ఎంఆర్ఎల్ స్థాయిని మించి వున్నాయి. 

 

చికెన్.. 

ప్యాకేజ్డ్ మిల్క్, చికెన్, కోడిగుడ్లు, ఫిష్ వాటర్ శాంపిల్స్‌లో ఎంఆర్ఎల్ స్థాయి కన్నా తక్కువ అవశేషాలున్నాయట. 

 

 

పాయిజన్‌తో కూడిన పెస్టిసైడ్స్.. 

క్లోర్‌పిరిఫోస్, ఇథియాన్, ఎసిటమిప్రిడ్, సైపర్ మెథ్రిన్, 12.5% వెజిటబుల్ శాంపిల్స్‌లో ఆమోదించని పెస్టిసైడ్స్ వున్నాయి. ఎసిఫేట్, బైఫెంత్రిన్, ట్రయాజోఫోర్స్, మెటాక్సిల్, మలాథియాన్. 

 

సైడ్ ఎఫెక్ట్స్.. 

క్లోర్‌ఫిరిఫోస్.. ఇది గర్భవతుల్లో శిశువు మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తలనొప్పి, చూపు మందగించడం, అలసట వంటి తదితరాలు కలుగుతాయి.

ఇథియాన్.. జ్ఞాపకశక్తి తగ్గుతుంది, డిప్రెషన్, తలనొప్పి, పీడకలలు, స్లీప్ వాకింగ్ వంటి రుగ్మతలకు ఇది కారణం,

మలాథియాన్..

ల్యూకేమియా రక్తహీనతకు ఇది కారణమని తేలింది. ఎసిఫేట్ పునరుత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది..

డీడీటీ...

కాలేయ సంబంధిత జబ్బులు వస్తాయి.. లివర్ దెబ్బతినే అవకాశముంది. 

 

 

సేంద్రీయ ఎరువులు వాడకపోతే.. 

పండ్లు, కాయగూరలకు సంబంధించి 50శాంపిల్స్‌లో పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ కనిపించాయి. 8 శాంపిల్స్ (2%) లో ఎంఆర్ఎల్ స్థాయిని మించి అవశేషాలున్నాయి. 

 

 
 
 
Related News

JournalistDiary