AP and TS / Entertainment
మహానుభావుడు తొలిరోజు వసూళ్లు ఎంత?
19 days ago

మారుతి-శర్వానంద్ కాంబోలో దసరా సందర్భంగా విడుదలైన ‘మహానుభావుడు’ మూవీ మొదటిరోజున ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్ల వసూళ్ళను రాబట్టిందని సమాచారం. శర్వానంద్ కెరీర్‌లోనే మొదటి రోజున ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి.

రెండు భారీ బడ్జెట్ మూవీల (జై లవకుశ, స్పైడర్) మధ్య పరిమిత బడ్జెట్‌తో రిలీజైన ‘మహానుభావుడు’ చిత్రానికి ఈ లెవెల్‌లో కలెక్షన్స్ రావడం అసాధారణమని అంటున్నారు. యూత్‌తోబాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథతో మారుతి ఈ సినిమాను తెరకెక్కించారు. శర్వానంద్ నటన, హీరోయిన్ మెహ్రీన్ గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. వెన్నెల కిషోర్ కామెడీ అలరించగా, నాజర్ వంటి సీనియర్ నటుడి యాక్టింగ్ పూర్తి ప్లస్ పాయింట్ అయ్యింది.

 

ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి : 

నైజాం 75 లక్షలు

ఉత్తరాంధ్ర 39 లక్షలు

సీడెడ్ 34 లక్షలు

ఈస్ట్ 30 లక్షలు

వెస్ట్ 19 లక్షలు

నెల్లూరు 8 లక్షలు

గుంటూరు 25 క్షలు

కృష్ణా 22 లక్షలు

మొత్తం : 2.52 కోట్లు

 

Read Also

 
Related News
JournalistDiary