World / Technology
వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ ట్రాన్స్‌ఫర్స్
11 days ago

గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం ద్వారా వాట్సాప్ తన యాప్ కి సరికొత్త అప్ డేట్ చేపట్టింది. 2.17.295 వెర్షన్ తో యాప్ లో హిడెన్ పేజ్ లో తన యాప్ ను అప్ డేట్ చేసింది. ఈ అప్ డేషన్  చాలా కాలంగా మార్కెట్ లో చక్కర్లు కొడుతున్న పేమెంట్ ఫీచరని డబ్ల్యూ ఏ బీటా ఇన్ఫో పేర్కొంది. ఇది షేర్ చేసిన ఇమేజ్ లో ఫేస్ బుక్ కు చెందిన ఈ-చాటింగ్ యాప్-యూపీఐ ద్వారా బ్యాంకు నుంచి బ్యాంకుకు నగదు  ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఆధార్ సదుపాయంతో ఇది పని చేస్తుంది. ఇప్పటికే మేనేజింగ్ యాప్ లో బాగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ తన కస్టమర్లను మరింత పెంచుకోవడానికి పేమెంట్ ఫీచర్ ని కూడా లాంచ్ చేయబోతోంది. ఈసరికొత్త ఫీచర్ని వినియోగించుకునేందుకు  వాట్సాప్ పేమెంట్స్ అండ్ బ్యాంక్, టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు యూపీఐ ద్వారా వాట్సాప్ లో లావాదేవీలు నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ముందుకు వచ్చినట్టు సమాచారం.  పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో యూపీఐ ద్వారా జరిగే నగదు లావాదేవీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో సరికొత్త యాప్ లు పుట్టుకొచ్చాయి.

 
 
Related News