India / Politics
చిన్నమ్మను తప్పించడం కష్టమే
71 days ago

తమిళనాడు రాజకీయాలు మళ్ళీ హీటెక్కాయి.  తాజాగా గురువారం చెన్నైలో సీఎం పళని స్వామి నేతృత్వంలో సమావేశమైన ఆయన వర్గం..పన్నీర్ సెల్వం వర్గంలో విలీనావకాశాలపై చర్చిచినట్టు తెలిసింది. ఇదే సమావేశంలో... పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం బెంగుళూరు జైల్లో ఉన్న శశికళను,  ఆమె మేనల్లుడు, పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ ని సాగనంపాలన్న యోచన కూడా చేశారని తెలిసింది. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గా దినకరన్ నియామకం చెల్లదని పళని స్వామి వ్యాఖ్యానించారు. అయితే కొద్దిసేపటికే దినకరన్ కౌంటరిచ్చారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళే తనను ఈ పదవిలో నియమించారని, తనను తొలగించే అదికారం వీరికి లేదని ఆయన అన్నారు. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఒకప్పుడు పళని, పన్నీర్ సెల్వం వర్గాలే శశికళని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశాయి. అయితే ఆమె జైలు పాలు కావడంతో ఇప్పుడు ఈ వర్గాలు ఆమె పైనా, దినకరన్ పైనా కారాలు నూరుతున్నాయి. ఒకవేళ శశికళ పైనా, తనపైనా    వేటు వేసి తమ  నియామకాలు  చెల్లవని ఈ వర్గాలు ప్రకటిస్తే ఈసీని దినకరన్ ఆశ్రయించ వచ్చు. తనకున్న 37 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన తన వాదన గెలిపించు కోవచ్చు. పైగా దినకరన్ కు  పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పార్టీ రూల్స్ ప్రకారం వీరి వాదనే సరైనదని ఈసీ భావించే అవకాశాలున్నాయి. అప్పుడు పార్టీలో శశికళ, దినకరన్ వర్గాలదే పై చేయి అవుతుంది. అంటే పార్టీ నుంచి వీరి తొలగింపు అంత వీజీ కాదన్నది రాజకీయ విశ్లేషకుల భావన.

 

Read Also

 
Related News
JournalistDiary