World / Health
బాబోయ్...యమకారం
342 days ago

గుంటూరు మిర్చే ఘాటు అనుకుంటే దాని తాత లాంటి ఘాటైన కారంతో కూడిన మిర్చి ఒకటి పుట్టుకొచ్చింది. దాన్ని ముట్టు కోవాలంటేనే చేతికి గ్లోవ్స్ ధరించాల్సిందేనట. మామూలు కారప్పొడి కన్నా 400 రెట్లు ఎక్కువ ఘాటు తో కూడిన ఎర్రని మిర్చిని చూస్తే గూబ గుయ్యి మంటుంది.

ఇప్పుడు బ్రిటన్ అంతటా టెస్కో స్టోర్లు, సూపర్ మార్కెట్లలో దీన్ని అమ్ముతున్నారు. వాల్డ్ లోనే ఈ చిల్లీ పెప్పర్ అతి ఘాటైనదని గిన్నిస్ బుక్ కూడా గుర్తించింది. ఇటలీలో సాల్వటోర్ గెనోవీస్ అనే రైతు తన ఏడెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఈ హాటెస్ట్ మిర్చిని పండిస్తున్నాడు.

బ్రిటన్ బెడ్‌‌ఫోర్డ్‌షైర్ దగ్గరి ఓ గ్రామంలో దీని సంకర జాతి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. కెరొలినా రీపర్ అని కూడా పిలిచే ఈ మిర్చిని టెస్కో ప్రతినిధి ఒకరికి సాల్వటోర్ రుచి చూపి అతనికి చుక్కలు చూపాడు.

 

 
 

Read Also

 
Related News

JournalistDiary