జనసేన నేత సినీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోగ్యం నువ్వే కాపాడాలి దేవుడా అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఇంకా ఆయన ఆరోగ్యం మన చేతుల్లో లేదు.
ఆయన కోసం ఈ రోజు రాత్రి నేను దీపం వెలిగిస్తాను అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఆరోగ్యం బాగుపడితే అమ్మోరికి తలనీలాలు ఇస్తాను… నావి కాదు అంబటివి అంటూ విమర్శించారు. నాగ బాబు కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై వైసీపీ నేతలు, అంబటి రాంబాబు మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.