అక్కినేని నాగార్జున వారసుడు టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అఖిల్.
అయితే ఈ చిత్రంలో ముంబై మోడల్ సాక్షి వైద్య కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారక ప్రకటన కూడా వెలువడాల్సి ఉందట. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మించనున్నారు.