ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. డ్రా అనుకున్న మ్యాచ్ ను తిప్పేసి.. విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లను భారత బౌలర్లు ఆడుకున్నారు. కేవలం 120 పరుగులకే కట్టడి చేసి ఆలౌట్ చేశారు.
ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. కోహ్లీసేన ప్రదర్శనపై ప్రముఖులు, క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించిందని కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Advertisements