ఆదిలాబాద్ తాటిగూడ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సయ్యద్ సమీర్ మృతి చెందాడు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా చిన్నపిల్లలు ఆడుకునే క్రికెట్ విషయంలో రేగిన వివాదం ఈ ఘర్షణకు కారణం అయింది. ఈ నెల 18న ఎంఐఎం నేత ఫారూఖ్ ఇదే విషయమై కత్తి, తుపాకీ తో హాల్ చల్ చేశారు. కాల్పులు కూడా జరిపారు.
ఈ ఘటనలో గాయపడ్డ సయ్యద్ జమీర్ ను అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆ ఘర్షణ సమయంలో సయ్యద్ సమీర్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాగా ఈ రోజు ఉదయం సయ్యద్ మృతి చెందారు.