వలసకార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేత వీహెచ్ మండిపడ్డారు . ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే , అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు . ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు . గాంధీభవన్‌లో వీహెచ్ దీక్షను విరమించారు. వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విరమింపజేశారు. వలస కార్మికుల కోసం రోడ్డెక్కిన వీహెచ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . అరెస్ట్ కు నిరసనగా , వలస కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ వీహెచ్ దీక్షకు దిగారు .
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ వలస కార్మికులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత చొరవ తీసుకుంటే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం లేక వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.ఒడిశా కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బులతో ఒక బస్సును ఏర్పాటు చేసింది . జెండా ఊపి వలస కార్మికులను సొంతూళ్లకు పంపించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి , జగ్గారెడ్డి , మరికొందరు కాంగ్రెస్ నేతలు .