భర్తలూ…చెప్పేది కాస్త జాగర్తగా వినండి.!నోరు అదుపులో పెట్టుకోండి..భార్యల దగ్గర పద్ధతిగా మసులుకోండి.!కాదు.. మేము ఇలాగే ఉంటాం.ఇలాగే బతికేస్తాం.మనల్నెవడ్రా ఆపేదని అడ్డదిడ్డంగా మాట్లాడితే భార్య చేతిలో బలైపోతారు. కాగే నూనెలో కాలిపోతారు.
ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే…అనకాపల్లి జిల్లాలో ఓ దారుణం జరిగింది. భర్తపై కోపం పెంచుకున్న ఓ భార్య అతడిపై సలసలకాగే వేడి నూనె పోసేసింది. చుక్క నూనె వంటిమీద పడితే ఎంతగా మండుతుందో మగవారికన్నా వాళ్ళకే బాగా తెలుసు. అలాంటిది సలసలా కాగే నూనెపోసేసిందంటే. జస్ట్ ఇమాజిన్ !మైడియన్ భర్తలు..!
ఇది చోడవరం మండలం లక్ష్మీపురంలో బయటపడ్డ దారుణం. ఇక విషయంలోకి వెళ్తే… స్థానికుల కథనం ప్రకారం బాధితుడు వెంకటేశ్వరరావు కొన్నాళ్ల క్రితం భార్య మరణించడంతో, విజయ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడట పాపం.! అయితే.. ఆస్తి పంపకాల విషయంలో వెంకటేశ్వరరావుకు, విజయకు మధ్య విభేదాలు తలెత్తాయట.
అంత వరకూ బానే ఉంది. మొగుడూ పెళ్ళాలకి గొడవలు రాకపోతే గోడపక్కనుంచి వినే వాళ్ళకి వస్తాయా..!? ఈ క్రమంలో విజయ తన పుట్టింటికి వెళ్లిపోయింది ఇది కూడా బాగానే ఉంది. భర్తపై కోపం పెంచుకున్న ఆమె ఇటీవల ఓ పథకం పన్ని భర్తను మాట్లాడుకుందామంటూ పుట్టింటికి పిలిచిందిట.
అతడు వచ్చాక సలసల కాగే నూనె అతడిపై పోసింది. దీంతో.. స్థానికులు వెంకటేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. అంతకన్నా ఏం చెయ్యగలరు పాపం.అడ్డొస్తే వాళ్ళమీద పోస్తుంది.ప్రస్తుతం మనవాడి ఆరోగ్యం నిలకడగానే ఉందట.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.తోలూడిపోయాక పోలీసులు వెన్నుతట్టి వెన్నరాయాలిగా మరి.!ఇలాంటి భార్య ఏభర్తకూ రాకూడదని ప్రస్తుత భర్తలు,కాబోయే భర్తలు కోరుకోవడం మంచిది.