సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఘన విజయం అందుకొన్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబెడుతోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో కూడా వైష్ణవ్ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కింగ్ నాగార్జున సైతం వైష్ణవ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సొంత బ్యానర్ అన్నపూర్ణ బ్యానర్ పై ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట.
ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అలాగే జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇక ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే కలెక్షన్ల మోత మోగిస్తోంది. 35 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి దూసుకు పోతోంది.