కరోనా వైరస్.. ఏడాది కాలంగా మానవాళిని ముప్పు తిప్పలు పెడుతోంది. కోట్లాది మంది ఈ మహమ్మారి బారినపడి ఎన్నో బాధలుపడ్డారు. పడుతున్నారు. నెలల వ్యవధిలోనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పయారు. ప్రపంచానికి శత్రువుగా మారిన కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసు కానీ.. ఎంత పరిమాణంలో ఉంటుందో చాలా మందికి తెలియదు. ఒక వేళ తెలిసినా… అందుకు ఉపయోగించే సైన్స్ పరిభాష చాలా మందికి అర్థం కాదు. కరోనా వైరస్ పరిమాణం గురించి తెలియాలంటే.. దాని కంటే చిన్న, పెద్దవైన ఇతర వైరస్ లేదా కణాల గురించి కూడా తెలుసుకోవాలి.
కరోనా వైరస్ అత్యంత చిన్న కణమే కానీ.. మనకు తెలిసిన అతి చిన్న కణం ఇది కాదు. జికా వైరస్, ఈ- కోలికి కారణమయ్యే T-4 బాక్టీరియోఫేజ్ వైరస్ కణాలు.. కరోనా వైరస్ కంటే పరిమాణంలో చాలా చాలా చిన్నవి. సాధారణంగా కంటికి కనిపించని కణాలను మైక్రాన్లలో కొలుస్తారు.ఈ లెక్కన జికా వైరస్ 0.045 మైక్రాన్లు ఉంటే.. ఇ-కోలి వైరస్ 0.225 మైక్రాన్లు ఉంటుంది. వీటి తర్వాతే కరోనా వైరస్ జాబితాలోకి వస్తుంది. కరోనా వైరస్ పరిమాణం గరిష్టంగా 0.5 మైక్రాన్లు ఉంటుంది. అంటే కరోనా వైరస్ కంటే కూడా జికా, ఇ- కొలి వైరస్‌లు అత్యంత ప్రమాదకరమైనవి. కానీ కరోనాలాగా అవి తీవ్రంగా వ్యాపించలేదు. ప్రాణాలూ తీయలేదు.
కరోనా వైరస్ నేరుగా మానవ శరీరంలోకి వెళ్లలేదు. ఎక్కువగా అవి శ్వాసకోస బిందువుల్లో కలిసి ప్రవేశిస్తాయి. ఒక కణం మానవ శరీరంలోకి వెళ్లాలంటే.. అది 10 మైక్రాన్ల కంటే చిన్నదిగా ఉంటేనే.. అది శ్వాస మార్గంలో మానవ శరీరంలోకి ప్రయాణిస్తుంది. అంతకంటే పెద్దగా ఉంటే ఊపిరితిత్తులలోకి వెళ్లే కంటే ముందే.. ముక్కు లేదా గొంతులోనే చిక్కుకుని ఆగిపోతాయి. పుప్పొడి, ఉప్పు, ఇసుక రేణువులు అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అందుకే అవి శరీరంలోకి అంత సులభంగా వెళ్లవు.
కరనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదే అయినా..అంతకంటే పెద్ద వైరస్ వాయు కాలుష్యం అని నిపుణులు చెప్తుంటారు. వీటి పరిమాణం 2.5 మైక్రాన్లు ఉంటుంది. ఇందులో దుమ్ము, ధూళి, మసి, పొగ కణాలు ఉంటాయి. ఇవి నేరుగా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి. ఇక వీటి కంటే ప్రమాదకరమైన కణాలు.. అడవి మంట నుంచి వచ్చే పొగలో ఉండేవి. 0.4-0.7 మైక్రాన్ల మధ్య పరిమాణంలో ఉండే ఇవి హృదయం, నాడీ కణాలను కూడా దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు.