గ్రేటర్ ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పెన్‌తో టిక్ పెట్టినా ఓటుగానే పరిగణించాలంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ హైకోర్టు గడపతొక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈసీ తీరును తప్పుబడుతోంది.
స్వస్తిక్ గుర్తు బదులు పోలింగ్ స్టేషన్ నంబర్లున్న ముద్ర వేసినా ఓటుగానే భావించాలంటూ ఈసీ చెప్పడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్వస్తిక్ గుర్తుతో కాకుండా ఏ ఇతర గుర్తుతో ఓట వేసినా.. దాన్ని లెక్కలోకి తీసుకోరాదని డిమాండ్ చేసింది. రాజకీయపార్టీల దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ మేరకు ఎన్ఈసీకి ఆ పార్టీ లేఖ రాసింది.