హైదరాబాద్ ఎన్ కౌంటర్ పై మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”దిశ” కేసు నిందితులను ఎన్ కౌంటర్లో కాల్చి చంపడాన్ని ఆమె తప్పుబట్టారు. ఎన్ కౌంటర్ చాలా భయంకరమైనదన్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ట్వీట్ చేశారు. న్యాయ ప్రకియ ద్వారా నిందితులకు కోర్టు ద్వారా ఉరిశిక్ష వేయించి ఉండాల్సిందని…అది కాకుండా ఎన్ కౌంటర్ లో కాల్చి చంపితే ఇంకా కోర్టులు, చట్టాలు, పోలీసులు ఎందుకని ప్రశ్నించారు.