కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకున్నారు. మూడు నెలలు రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టి భవన నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారు. తప్పుడు నిర్ణయాల వల్ల లక్షల మంది కార్మికులు పస్తులు ఉన్నారు. ఎక్కడ హైకోర్టు మొట్టికాయలు వేస్తుందోనని భయంతో ఇప్పటికైనా కళ్లు తెరిచిపాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలనే నిర్ణయం తీసుకోవడం సంతోషం.
అలాగే మీరు కొత్తగా తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్ సైతం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కొత్తగా ధరణి ప్రకారం పాస్‌బుక్‌లు వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి వారసుల పేరు మీదకు మారాలంటే ఒక్కో ఎకరాకు మూడు వేలు రైతుల మీద భారం పడుతుంది. పాత పద్దతిలో ఉచితంగా అయ్యే వారసత్వ భూమి మార్పు ఉచితంగా అయ్యే వాటికి ఇప్పడు అధికారంగా రూ. 3వేలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను మానుకుని వారసత్వ మార్పిడి ఉచితంగా చేయాలి. అంతేకాకుండా ఇప్పడు రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గినట్లే ఎల్ఆర్ఎస్‌ను సైతం వెనక్కి తీసుకోవాలి. మీరు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల రక్తం తాగాలని చూస్తున్నారు.
Advertisements
కాయకష్టం చేసి ఫ్లాటు కొనుకున్న ప్రజల నుంచి లక్షల కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ఎల్ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో నేను వేసిన పిటిషన్‌లో సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. కాబట్టి వెంటనే ఎల్ఆర్ఎస్ వెనక్కి తీసుకుంటే కనీసం మీకు పరువైన తగ్గుతుంది.