ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 41,910 శాంపిళ్లను పరీక్షించగా..116 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగా చాలా రోజుల తర్వాత మరోసారి ఒక్క మరణం కూడా సంభవించలేదు. నిన్న 127 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,87,836 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో ఇప్పటికే 8,79,405 మంది కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 7,153 మంది మరణించారు. ప్రస్తుతం 1,278 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.