బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 3న నిర్వహించేందుకు సిద్దమవుతోంది. దీంతో ఓల్డ్ మలక్‌పేట్‌లో ఇప్పటికే ఓటు వేసిన వారి వేలికి మరోసారి ఇంకు గుర్తు పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా ఇవాళ ఓటు వేసినవారికి ఎడమచేతి చూపుడు వేలుకు గుర్తు పెట్టిన అధికారులు… ఎల్లుండి ఎడమ చేతి మధ్యవేలికి వేయనున్నారు.
ఒకవేళ ఎడమచేయి లేని వారికి కుడిచేతికి వేస్తారు. ఎడమచేతికి మధ్యవేలు లేనివారికి మరో వేలికి గుర్తు వేస్తారు. రెండు చేతులూ లేని దివ్యాంగులకు ప్రత్యేక విధానాన్ని ఈసీ అనుసరిస్తుంది.