కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత హ్యాండ్ ఇచ్చారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సుస్మితా దేవ్ పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారామె. ప్రజా సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కోల్ కతాలోనే ఉన్నారు. ఏ క్షణంలోనైనా మమతా బెనర్జీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సుస్మితా తండ్రి సంతోష్ మోహన్ దేవ్ అసోంలో అత్యంత ప్రజాదరణ ఉన్న కాంగ్రెస్ నేత.
Advertisements
మరోవైపు సుస్మితా రాజీనామాపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. యువనేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుంటే.. కాంగ్రెస్ బలోపేతానికి తాము ఏమీ చేయడం లేదంటూ సీనియర్లను నిందిస్తారు… కానీ.. పార్టీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని ముందుకు సాగిపోతూనే ఉంటుందంటూ సెటైర్లు వేశారు.