ఎప్పటినుంచో హిట్ లేక ఎదురు చూస్తున్న సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాతో సక్సెస్ సాధించాడు. ఓటిటి వేదికగా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే సూర్య త్వరలో ఓ తెలుగు సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సమాచారం. ఆ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారట. అంతే కాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారట.
ఎప్పటి నుంచో నేరుగా తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్న సూర్యకు హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ బోయపాటి చెప్పాడట. ఆ స్టోరీ సూర్య కు కూడా నచ్చిందట. దీంతో ఆ సినిమాల్లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.