సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ చైనాలోనూ హల్ చల్ చేస్తున్నాడు. ఈ శుక్రవారం అక్కడి ప్రేక్షకుల ముందుకొచ్చిన రోబో 2.0తో చైనీయులు ఖుషీ ఖుషీగా వున్నారు. 48 వేల థియేటర్లలో రిలీజ్ అయిన 2.0లో రజనీ యాక్షన్ చూసిన చైనీస్ ఫిదా అయిపోతున్నట్టు సమాచారం.
రజనీకాంత్ డ్యూయల్ రోల్స్ చేసిన ఈ మూవీలో చిట్టి, వశీకరణ్ పాత్రలు చైనీయుల్ని బాగా ఆకట్టుకున్నాయి. రెహమాన్ మ్యూజిక్ చైనీస్ మనసు దోచింది. అక్షయ్ విలనిజం, అమీజాక్సన్ హొయలు చైనీస్‌కు స్పెషల్ ఎట్రాక్షన్.
రోబో 2.0 మూవీని చైనీస్ భాషలోకి డబ్ చేసి హెచ్‌వై మీడియా పంపిణీదారులు దేశమంతటా విడుదల చేశారు.