
ట్రంప్ ఈసారి ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ట్రంప్ కేవలం స్వదేశీ జపమే చేస్తూ.. ఆ సెంటిమెంట్ తోనే పోయినసారిలా నెగ్గాలని తెగ ట్రై చేస్తున్నారు. కాని ఇప్పటికే ఆయన ఏమీ చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. పైగా ఎకానమీ దెబ్బతినగా.. ఆ తర్వాత వచ్చిన కరోనా ఆ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేసింది. కరోనా కట్టడిలోనూ.. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని.. పరిస్ధితిని అదుపు చేయడంలోనూ ట్రంప్ విఫలమయ్యారు. పైగా ఈ విషయంలో కూడా చైనాపై విమర్శలు చేస్తూ తప్పించుకుందామని చూశారు. పైగా ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి.. విదేశీయుల ఉద్యోగాలపై, వారి రాకపై, వారికి గ్రీన్ కార్డులపై వరుసగా ఆంక్షలు విధిస్తూ వచ్చారు. దీని వలన అమెరికన్స్ తనను ఆదరిస్తారనేది ట్రంప్ నమ్మకం.
ప్రత్యర్ధి జో బిడెన్ మాత్రం.. చాలా జాగ్రత్తగా ఒక్కో స్టెప్ వేస్తూ.. ట్రంప్ వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలను డెవలప్ చేసుకుంటూ.. జోరు పెంచుతున్నారు. మొదట్లో ఆయన పెద్దగా స్పీడున్నట్లుగా అనిపించలేదు. కాని ఆయన వేసిన మొదటి స్టెప్.. వీసా ఆంక్షలపైనే.. అవన్నీ తీసేస్తానని.. వారి ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని.. అదే సమయంలో.. ఆర్ధిక వ్యవస్ధ సరైన గాడిలో పడితే.. అమెరికన్ల నిరుద్యోగం కూడా తగ్గించొచ్చని ప్రకటించారు. అంతే దీని వలన ఆయనకు రెండు లాభాలు.. ఒకటి.. ఓటు హక్కు ఉన్న భారతీయులతో పాటు ఇతర విదేశీయులంతా ఆయన వైపు తిరుగుతారు.. మరొకటేంటంటే.. వీసా ఉద్యోగాల మీదే ఆధారపడి లాభాల్లో నడుస్తున్న కంపెనీలన్నీ ఆర్ధికంగా జో బిడెన్ కు అండగా నిలబడటానికి డిసైడ్ అయిపోయాయి.
ఇప్పుడు లేటెస్టుగా.. కమలా హ్యారీస్ ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించడంతో… 16.4 మిలియన్ల కంటే అధికంగా ఉన్న నల్లజాతివారి ఓట్లను ఆకట్టుకుంటున్నారు. ఒక నల్లజాతీయుడిని అమానుషంగా చంపిన పోలీసుల వైఖరితో.. దేశమంతా అట్టుడికిపోయింది. ఐ కాంట్ బ్రీత్ ఉద్యమం మామూలుగా జరగలేదు. ఆ ఎఫెక్ట్ ట్రంప్ ప్రభుత్వంపై పడకుండా ఉండదు. ఇప్పుడు జమైకాకు చెందిన వ్యక్తి కూతురైన కమలా హ్యారీస్ తల్లి భారతీయురాలు. నల్లజాతి సంతతి కావడంతో.. నల్లజాతీయులంతా డెమోక్రాట్లకే మద్దతిస్తారని అంచనాలు వేస్తున్నారు. విదేశీయులు, నల్లజాతీయులు వీరంతా సాలిడ్ గా జో బిడెన్ వైపు వస్తే.. ఆయన గెలుపు సులువయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.
మరి జో బిడెన్ వేసే తర్వాతి ఎత్తుగడలేంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రంప్ కన్నా.. కాస్త డల్ గా అనిపించే జో బిడెన్.. ఇప్పుడు రెండు స్టెప్పులు వేయడంతో.. జెంటిల్మేన్ లా కనపడుతున్నారు. ఇప్పటికే కరోనా అటాక్ తో విఫలమైన ట్రంప్ ప్రెస్ మీట్లలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నవ్వులపాలయ్యారు. దూకుడుగా వ్యవహరిస్తారనే ఇమేజ్ కూడా ఇప్పుడు కరిగిపోయింది. గత ఎన్నికల్లో అంతా ట్రంప్ ది.. మీడియా మేనేజ్ మెంటేనని ఇప్పుడు అందరూ కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో ఆయన క్యాంపెయిన్ వర్కులో పాల్గొన్న కేఎపాల్ సైతం ట్రంప్ ను ఓడించాలని..అందుకు పది కారణాలు అంటూ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు. ట్రంప్ తో పాటు పని చేసిన టీమ్ లో ముఖ్యమైనవారందరినీ ఆయన దూరం చేసుకున్నాడు.. వారందరూ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు.
ట్రంప్ కు వ్యతిరేకంగా ఎదురవుతున్న పరిస్ధితులతో పాటు.. జో బిడెన్ తెలివిగా తీసుకుంటున్న నిర్ణయాలతో.. ఈసారి గెలుపు డెమోక్రాట్లదేనని.. జో బిడెన్ విజయం ఖాయమనే అంచనాలు వినపడుతున్నాయి.