ఢీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో మంచు విష్ణు. ఈ సినిమాతోనే దర్శకుడు శ్రీనువైట్ల హిట్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. దాదాపు 13సంవత్సరాల తర్వాత ఇద్దరూ మళ్లీ సినిమాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో మరోసారి ఢీనే నమ్ముకున్నారు. కాకపోతే ఈసారి డబుల్ ఢీ.
అవును… ఢీ మూవీకి సీక్వెల్ గా ఢీ అండ్ ఢీ అని టైటిల్ ను ఖరారు చేశారు. డబుల్ డోస్ అనేది ఉప శీర్షిక. అంటే ఢీకి మించిన కామెడీ, యాక్షన్ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ మూవీని మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తుండగా, శ్రీనువైట్ల ఆస్థాన కథ రచయిత గోపి మోహన్ కథ అందిస్తున్నాడు. మణిశర్మ తనయుడు మహతి సంగీతం అందిస్తుండగా, పీటర్ హెయిన్స్ యాక్షన్స్ చూడనున్నారు.
ఇక ఈ మూవీలో హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.